ఇమిటేట్‌ చేస్తున్న సుధీర్‌..

బుల్లితెర హీరో మన సుడిగాలి సుధీర్‌. ఆర్టిస్టు గానే కాదు ఇప్పుడు హీరోగా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాలో ధన్యబాలకృష్ణ కథానాయిక. రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో కె.శేఖర్‌ రాజు నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ మొదటి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫిల్మ్‌ చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘సాఫ్ట్‌వేర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ట్రెండీ కంటెంట్‌తో రూపొందుతున్న చిత్రమిది.వినోదంతోపాటు పూర్తిగా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించాం. సుధీర్‌కి జోడీగా ధన్య చక్కగా సరిపోయారు. ఇందులో గద్దర్‌ ఓ పాట పాడడమే కాకుండా నటించడం విశేషం’’ అని తెలిపారు. ‘‘నా పేరుతో సినిమా టైటిల్‌ ఉండటం ఆనందంగా ఉంది.ఆద్యంతం వినోదాన్ని పంచే సినిమా ఇది. డిఓపి రాంప్రసాద్‌, ఎడిటర్‌ గౌతం రాజు, రామ్‌ లక్ష్మణ్‌, భీమ్స్‌ వంటి సీనియర్‌లతో పని చేస్తానని ఊహించలేదు. డాన్స్‌, ఫైట్స్‌కి మంచి స్కోపున్న సినిమా ఇది. నాకు ఎంతో ఇష్టమైన రజినీకాంత్‌, పవన్‌ కల్యాణ్‌గారిని ఈ సినిమా కోసం ఇమిటేట్‌ చేశా’’ అని సుధీర్‌ చెప్పారు.

Image result for software sudheer

Leave a Response