క్రికెట్‌లో కొత్త రూల్స్…..?

క‌రోనా కారణంగా తాజాగా క్రికెట్ నిబంధనల్ని కూడా ఐసీసీ కఠినతరం చేసింది. వైర‌స్ కార‌ణంగా అనేక టోర్నీలు ర‌ద్దుకాగా, మ‌రికొన్ని వాయిదా ప‌డ్డాయి. తాజా ప‌రిస్థితుల‌ను చూస్తుంటే జూన్ నుంచి మళ్లీ క్రికెట్ సిరీస్‌లు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రౌండ్ లో ప్లేయ‌ర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు అంపైర్లు నడుచుకోవాల్సిన తీరు, మ్యాచ్ అధికారుల నియమావళిపై  ఐసీసీ ప్రత్యేకంగా కొన్ని రూల్స్‌ని తెర‌పైకి తెచ్చింది. ఈ క్రమంలో ఆట‌గాళ్లు, అంపైర్ల మధ్య ఉన్న చైన్ సైకిల్ రిలేషన్‌ని పూర్తిగా తప్పించింది.మాములుగా ఓవర్ ముగిసిన తర్వాత… ఫీల్డింగ్ టీమ్ బంతిని ఫీల్డ్ అంపైర్‌కి ఇస్తుంది. వన్డే మ్యాచుల్లో అయితే.. రెండు బంతుల్ని ఉప‌యోగిస్తుంటారు. దాంతో.. ప్రతి ఓవర్ వేసే ముందు స్ట్రైకింగ్ అంపైర్ చేతి నుంచి బౌలర్ బంతిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపై కూడా అదే రూల్ కొన‌సాగుతుంది. అయితే అంపైర్ మాత్రం బంతిని అందుకునేముందు తన చేతులకి గ్లౌవ్స్‌ని ధరించాలి. ఇదే ప‌ద్దతిలో ఓవ‌ర్ వేయ‌బోయే ముందు బౌల‌ర్.. అంపైర్‌కి తన క్యాప్, క‌ళ్ల‌ద్దాలు ఇవ్వడాన్ని కూడా ఐసీసీ నిషేధించింది. గ్రౌండ్ లో ప్లేయ‌ర్స్ మాత్ర‌మే కాకుండా..వారితో అంపైర్లు కూడా కనీసం 1.5 మీటర్ల డిస్టెన్స్ పాటించాల‌ని సూచించింది. ఏదైనా ఒక‌ క్రికెట్ జట్టు సిరీస్‌కి ఆడ‌టానికి ముందు 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటే.. అది కరోనా ఫ్రీ టీమ్ గా మారుతుంది. కాబట్టి.. ఆ టీమ్‌లోని ఆటగాళ్ల మధ్య కోవిడ్-19 వ్యాప్తించే ప్రమాదం తగ్గుతుంది. ఇక జ‌ట్టులోని క్రికెటర్లకి బయటి నుంచి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్న వ్యక్తులు అంపైర్లు మాత్రమే. అటువంటి ప్ర‌మాదాలు జ‌రగ‌కుండా ఐసీసీ ఈ ఆదేశాలు జారీ చేసింది.

Leave a Response