జాక్ పాట్ రిలీజ్ డేట్ ఖరారు…

కోలీవుడ్ యాంగ్ హీరో సూర్య తన సొంత బ్యానర్లో జ్యోతిక ప్రధాన పాత్రధారిగా ‘జాక్ పాట్’ నిర్మితమైంది. నాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమాలో రేవతి కూడా ఒక కీలకమైన పాత్రలో అభిమానుల ముందుకు వస్తుంది. తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను తెలుగు అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు.కల్యాణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, పూర్తి వినోదభరితంగా రూపొందింది. యోగిబాబు .. సముద్రఖని .. రాజేంద్రన్ .. మన్సూర్ అలీఖాన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. కథల విషయంలో జ్యోతిక ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, రీ ఎంట్రీలో దూసుకుపోతోంది. తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

Leave a Response