జిమ్ లో కసరత్తులు చేస్తున్న చిరు…

టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. తన నటనతో అందరిని ఎంతగానో అల్లరిచ్చాడు. ప్రస్తుతం 64 ఏళ్ల వయసులోనూ మెగాస్టార్ జిమ్‌లో కసరత్తులు చేస్తూ కుర్ర హీరోలతో పొట్టి పడ్డుతున్నాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన చిరంజీవి స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగారన విషయం మన అందరికి తెలిసిందే. యువ హీరోల హవా నడుస్తున్న ప్రస్తుత కాలంలో ‘సైరా నరసింహారెడ్డి’లో నటించి హిట్ అందుకున్నారు. తాజాగా ఆయన కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభంకానుంది. దీనికోసమే ఆయన జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన ఒక నడివయస్కుడి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. జిమ్ లో చిరంజీవి డంబెల్స్ ఎత్తుతోన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వయసులో ఆయన పడుతున్న తపన, కష్టం, వృత్తి పట్ల ఆయనకున్ననిబద్ధతను చాటుతోంది.

Leave a Response