జెర్సీ సినిమా దర్శకుడితో రామ్ చరణ్ ?

ram-charan

రామ్ చరణ్ తేజ్ నెక్స్ట్ RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.ఇక RRR సినిమా అనంతరం రామ్ చరణ్ ఎవరితో వర్క్ చేయబోతున్నారు అనే విషయంలో ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాలేదు.
నాని జెర్సీ సినిమా దర్శకుడితో రామ్ చరణ్ ఇటీవల ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు టాక్ వచ్చింది. దాదాపు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా కథనాలు వెలువడ్డాయి.గౌతమ్ జెర్సీ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మరొక సినిమా చేయకూడదని గౌతమ్ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు.

Leave a Response