తల్లి కాబోవడంతో సినిమాలకు దూరం…సమంత

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వారి ఇంటి కోడలైన తర్వాత సమంత కెరీర్ మరింత జోరు పెరిగింది. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ వరుస విజయాలు అందుకుంది ఈ అమ్మడు. అంతేకాదు ప్రతిభ గల నటిగా కూడా గుర్తింపు సంపాదించుకుంది. ఓ బేబీ వంటి మహిళా ప్రాధాన్యమున్న సినిమాలో నటించి విజయాన్ని కూడా అందుకుంది ఈ సుందరి. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా 96 రీమేక్‌లో నటిస్తోంది.ఈ సినిమా తర్వాత సమంత కొద్దిరోజులు గ్యాప్ తీసుకోనున్నట్టు టాలీవుడ్స లో గాసగుసలు వినిపిస్తున్నాయి. తల్లి కావాలనే నిర్ణయం తీసుకోవడం వల్లే సమంత కొద్ది రోజులు సినిమాలకు దూరం కానుందట. అందుకే కొత్త సినిమాలను సమంత అంగీకరించడం లేదట. ప్రస్తుతం చేస్తున్న 96 రీమేక్, ఫ్యామిలీమెన్-2 వెబ్‌సిరీస్ తర్వాత సినిమాలను తాత్కాలికంగా పక్కన పెట్టాలని సమంత అనుకుంటోందట. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటోందని వార్తలు వస్తున్నాయి.

Image result for samantha

Leave a Response