వెంకీ నెస్ట్ మూవీ డైరెక్టర్ ఎవరో తెలిస్తే మీరు షాక్…?

టాలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ అల్లుడు, తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా బ్లాక్‌బస్టర్ సినిమా అసురన్. ఈ సినిమా తమిళ గ్రామీణ నేపథ్యంలో తెరక్కెకించారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొల్పింది. పలు భాషల్లోకి రీమేక్ కాబోతోంది. తెలుగు వెర్షన్ కోసం ఈ సినిమా హక్కులను నిర్మాత సురేష్ బాబు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి విక్టరీ వెంకటేష్ హీరోగా తెలుగు వెర్షన్ తెరకెక్కబోతున్నట్టు సమాచారం.ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్చి, తెరకెక్కించగలిగే దర్శకుడి కోసం ప్రస్తుతం అన్వేషణ జరుగుతోందట. మాతృకను తెరకెక్కించిన వెట్టిమారన్‌నే దర్శకత్వం వహించమని అడిగారట. అయితే అందుకు ఆయన అంగీకరించలేదని సమాచారం. ఇప్పటికే కొందరు దర్శకులకు అసురన్ సినిమాను సురేష్ బాబు చూపించినట్టు తెలుస్తోంది. వారిలో ఎవరి వెర్షన్ బాగుంటే.. వారి దర్శకత్వంలో అసురన్ రీమేక్ త్వరలో పట్టాలెక్కబోతోందట.

Image result for victory venkatesh

Leave a Response