సోషల్‌ మీడియాలో వార్తలు నమ్మకండి.

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 విజేత ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. బిగ్‌బాస్‌లో ఫైనల్లో ఐదుగురు సభ్యులు నిలువగా.. వారిలో శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అయితే బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 టైటిల్‌ రాహుల్‌ సొంతం చేసుకుంటాడని సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. మరోవైపు బిగ్‌బాస్‌ విజేతగా శ్రీముఖి నిలుస్తోందని ఆమె అభిమానులు నమ్మకంతో ఉన్నారు. కాగా, ఈ సారి రాహుల్‌ టైటిల్‌ సొంతం చేసుకుంటాడని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లీక్‌లు నెటిజన‍్ల వాదనకు బలాన్ని ఇచ్చేలా ఉన్నాయి. శ్రీముఖి మీద కొద్దిపాటి ఓట్ల మెజారిటీతో రాహుల్‌ మొదటి స్థానంలో నిలిచాడనే ప్రచారం జరుగుతోంది.అయితే సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బిగ్‌బాస్‌ హోస్ట్‌ కింగ్‌ నాగార్జున స్పందించారు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 ఒక అద్భుతమైన ప్రయాణమని చెప్పారు. బిగ్‌బాస్‌ విన్నర్‌పై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు అని కోరారు. విజేత ఎవరనేది సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమం చూసి తెలుసుకోవాలని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. 

Leave a Response