24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు

corona

భారత్‌లో కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తోంది.రోజురోజుకు రికార్డుస్థాయిలో కొత్త కేసులతో మరణ మృదంగం మోగిస్తోంది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు మాత్రం తగ్గడంలేదు.కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం,గత 24 గంటల్లో భారత్‌లో అత్యధికంగా 8,392కొత్త కరోనా వైరస్ పాజిటివ్‌ వేసులు నమోదు అయ్యాయి.ఇక, ఒకేరోజు 230 మంది మరణించారు.ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,90,535కు చేరుకుంది.మృతుల సంఖ్య 5,394కు చేరింది.ప్రస్తుతం 93,322 యాక్టివ్‌ కేసులు ఉండగా.91,819 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Leave a Response