డిన్నర్ డేట్ కు వెళ్లిన క్రికెటర్ కేఎల్ రాహుల్..!

బాలీవుడ్ నటి అతియా శెట్టితో టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ డేటింగ్ లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ ఈ జంట కెమెరాకు చిక్కింది. ముంబైలోని ఓ ప్రముఖ హోటల్ కు వీరిద్దరూ డిన్నర్ డేట్ కు వచ్చారు. దీంతో వీరిద్దరి మధ్యా ప్రేమాయణం సాగుతుందన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. వీరితో పాటు బాలీవుడ్ నటుడు పంచోలీ, ఆకాంక్షల జంట కూడా కనిపించింది. అయితే వారిపై వస్తున్నా వార్తలపై అటు రాహుల్ గానీ, ఇటు అదియాలు గానీ ఏమీ స్పందించలేదు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ పోటీల్లో కర్ణాటక తరఫున ఆడుతున్న రాహుల్, గతంలో హీరోయిన్లు నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్, ఆకాంక్ష రంజన్ లతోనూ చట్టపట్టాలేసుకుని తిరుగుతూ మీడియాకు దొరికిన సంగతి తెలిసిందే.

Leave a Response