సుపరిపాలన ఆయనకు నిజమైన నివాళి..!

జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అక్టోబరు 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని ఓ ప్రత్యేక సందేశం అందించారు. మహాత్ముని మార్గం సదా ఆచరణీయం,మహాత్మా గాంధీ అనే పేరు స్మరించుకుంటే చాలని, భారతీయుల మనసంతా పవిత్రంగా మారిపోతుంది. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యంత అధికంగా ప్రభావితం చేసింది గాంధీయేనని అన్నారు. ఆయన 150వ జయంతిని ప్రతి ఒక్క భారతీయుడు ఓ వేడుకలా జరుపుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. .ఐన్ స్టీన్, మార్టిన్ లూథర్ కింగ్ వంటి మేధావులను సైతం గాంధీజీ ప్రభావితం చేశారని అన్నారు. ఆయన బోధించిన అహింస, శాంతి, సత్యాగ్రహం వంటి ఆయుధాలు, స్వతంత్ర సాధనలో ఆయన అనుసరించిన మార్గాలు ఇవాళ్టికీ ఆచరణీయమేనని వ్యాఖ్యానించారు. ఆ మహనీయుడు కోరుకున్న సుపరిపాలన అందించడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. అధికారంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆ దిశగా కృషి చేయాలని అన్నారు.

Leave a Response