మరో అవకాశం ఇవ్వాలని కేసీఆర్…

సీఎం కేసీఆర్ సమ్మెకు దిగి, ఎట్టి పరిస్థితుల్లోనూ విధులకు రాబోమని భీష్మించుకు కూర్చున్న దాదాపు 46 వేల మంది కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. సమ్మె కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే, కార్మికులకు మరో అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నేడు మరోసారి ఉన్నతాధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు మరింత తీవ్రరూపం దాల్చింది. సగానికి పైగా బస్సులు డిపోలకు పరిమితం అయ్యాయి. విపక్ష పార్టీలు సైతం ఆర్టీసీ కార్మికులకు మద్దతిస్తూ, నిరసనలకు దిగుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Leave a Response