స్పా సెంటర్లలో సెక్స్ రాకెట్..!

ఉత్తరప్రదేశ్ పోలీసులు సోషల్ మీడియా వాట్స్ యాప్ లో అమ్మాయిల ఫోటోలు పంపి, వారిని ఆకర్షించి, స్పా ముసుగులో వ్యభిచారం సాగిస్తున్న వారి బాగోతాన్నిబయటపెట్టారు. హంస ప్లాజాలోని మూడు స్పా సెంటర్లలో సెక్స్ రాకెట్ కొనసాగుతోందన్న సమాచారం అందడంతో, పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో 9 మంది యువతులు సహా, మొత్తం 19 మందిని అరెస్టు చేశారు. యువతుల ఫోటోలను పంపించి, వారిని స్పాలకు ఆహ్వానించి ఈ రాకెట్ నడుపుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యభిచార దందాను నిర్వహిస్తున్నది ఓ మహిళని గుర్తించినట్టు అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్ కేశవ్ కుమార్ వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న యువతుల నుంచి రూ. 16 వేలను, 24 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. స్పా సెంటర్లు నిర్వహిస్తున్న వారిలో కొందరు పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

Leave a Response