ప్రాణాలు తీసిన సెల్ఫీ..!

తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో నలుగురు స్నేహితులు సెల్ఫీ సరదాలో పడి ప్రమాదాన్ని ఊహించక పోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఊత్తంగరై సమీపంలోని సాంబారు జలాశయ సందర్శనకు స్నేహితులైన సంతోష్‌ (14), స్నేహ (19), వినోద (18), నివేద (20) నిన్న సాయంత్రం వెళ్లారు. జలాశయం అందాలు చూస్తూ పరవశించిపోయారు.అనంతరం జలాశయం గట్టుపై నిలబడి సెల్ఫీ తీసుకుంటుండగా నలుగురూ ఒకేసారి జారి జలాశయంలోకి పడిపోయారు. స్థానికులు వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. సమాచారం అందుకున్నా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలాన్ని చేరుకొని నలుగురి మృతదేహాలను వెలికితీశారు.దింతో తమిళనాడు అంత విషాదఛాయలు అలుకున్నాయి.

Leave a Response