అమెరికాలో తెలుగు అమ్మాయి ఆత్మహత్య…

హైదరాబాద్ కు చెందిన ఓ యువతి గృహహింసను తట్టుకోలేక అమెరికాలోని కరోలినా ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంది. నాగోల్ సమీపంలోని సాయినగర్ కు చెందిన గజం వనిత (38) భర్త రాచకొండ శివకుమార్ వేధింపులకు తాళలేక కొంతకాలం క్రితం తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఆపై గత జూలైలో భర్త వద్దకు వెళ్లిపోయింది. రెండు నెలల నుంచి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ కూడా చేయలేదు.ఈ క్రమంలో ఆదివారం నాడు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం అందడంతో, ఆ ఇంట్లో పెను విషాదం నెలకొంది.ఘటన తరువాత నార్త్ కరోలినా పోలీసులు శివకుమార్ ను అరెస్ట్ చేసి, విచారణ ప్రారంభించారు. అయితే,వనిత మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని వారు వేడుకుంటున్నారు.

Leave a Response