సినీ నటి పూర్ణను బ్లాక్ మెయిల్…

సినీ నటి పూర్ణ అలియాస్ కామ్నా కాసిమ్ కు బెదిరింపులు వచ్చిన కేసులో హెయిర్ స్టైలిస్ట్ ను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు వ్యక్తులు తనను వేధిస్తున్నారని ఆమె కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నిందితుల్లో ఒకరితో పూర్ణకు పరిచయం ఉందంటూ కొన్ని వార్తా సంస్థలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ ద్వారా పూర్ణ స్పందించింది. ‘ఈ ఇబ్బందికర సమయంలో నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. నా కేసుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలను రాశాయి. వీటిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఈ బ్లాక్ మెయిల్ కేసులోని నిందితుడితో కానీ ఆ ముఠాతో కానీ నాకు ఎలాంటి లింక్ లేదు. నిందితుడితో లింక్ పెట్టి తప్పుడు వార్తలను రాయొద్దని మీడియాను కోరుతున్నాను.

Leave a Response