మహేశ్ తో నమ్రత…

తన భర్త, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకునే నమ్రత, తాజాగా, ‘ఆస్క్ మీ యువర్ క్వశ్చన్’ సెషన్ లో పాల్గొని ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మీరు బాగా రుచిగా చేసే వంటకం ఏదని ఓ అభిమాని ప్రశ్నిస్తే, మ్యాగీ నూడుల్స్ అంటూ సమాధానం ఇచ్చారు. ఇష్టమైన హీరో ఎవరన్న ప్రశ్నకు, ఇది చాలా కష్టమైనదేనంటూనే మహేశ్ బాబేనని, మరో ప్రశ్నకు సమాధానంగా మహేశ్ చిత్రాల్లో ఒక్కడు, పోకిరి, దూకుడు, మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు అంటే ఇష్టమని చెప్పారు. జీవితంలో మధుర క్షణాలు ఏంటన్న ప్రశ్నకు సమాధానంగా, మహేశ్ ను పెళ్లి చేసుకోవడం ఒకటైతే, ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడం మరోటని అన్నారు. ఇక ఇతర ప్రశ్నలకు సమాధానంగా, తాను మహేశ్ బాబు సినిమాల్లో అసలు తలదూర్చబోనని, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందా? అంటే కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. తన తల్లిదండ్రులు మహేశ్ ను ఫస్ట్ టైమ్ చూడగానే తన మాదిరే ప్రేమలో పడిపోయి, పెళ్లికి అంగీకరించారని సమ్రత వ్యాఖ్యానించారు. 


Leave a Response