ఈ నెల 26న హైదరాబాదులో వివాహం…

nithin

కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లి వాయిదా పడుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఆయన వివాహం ఈ ఏడాది ఏప్రిల్లోనే జరగాల్సి ఉండగా, కరోనా ఉద్ధృతి వల్ల వాయిదా పడింది. తాను ప్రేమించిన షాలినిని ఆయన దుబాయ్‌లో ఘనంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌లోనే సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని భావించాడు. అయినప్పటికీ, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. చివరకు నితిన్ ఈ నెల 26న పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. వధూవరుల కుటుంబాలు కూడా ఈ ముహూర్తాన్నే నిశ్చయం చేసుకున్నట్లు తెలిసింది. హైద‌రాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో వారి పెళ్లి జ‌రుగుతుంద‌ని సమాచారం. తన ప్రేయసి షాలినితో నితిన్ నిశ్చితార్థం కొన్ని నెలల క్రితమే జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నితిన్ పలు సినిమాల్లో నటిస్తున్నాడు.


Leave a Response