గాల్వ‌న్ నేపథ్యంలో మోహన్‌లాల్…

ప్ర‌స్తుతం భార‌త్‌, చైనా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త‌, యుద్ధ వాతావ‌ర‌ణ‌ ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల గాల్వ‌న్ లోయ‌లో భార‌త్‌, చైనా సైనికులు మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌ల్లో ఇర‌వై మంది భార‌త సైనికులు అమ‌రుల‌య్యారు. ఇలాంటి నేప‌థ్యాన్ని ఆధారంగా చేసుకుని ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు మేజ‌ర్ ర‌వి ఓ సినిమాను రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ‘బ్రిడ్జ్ ఆఫ్ గాల్వ‌న్‌’ పేరుతో రూపొంద‌బోయే ఈ చిత్రంలో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ న‌టించ‌నున్నార‌ట‌. వీరివురి కాంబినేష‌న్‌లో ఇంత‌కు ముందు ‘1971 బియాండ్ బోర్డ‌ర్స్‌’ సినిమా విడుద‌లైంది. ఇందులో అల్లు శిరీష్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. 

Leave a Response