అర్జున్ కపూర్ తో రకుల్ హిందీ సినిమా…

ఎప్పుడూ షూటింగులతో బిజీబిజీగా ఉంటూ.. ఇక్కడి నుంచి అక్కడికి.. అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణాలు చేస్తూ, క్షణం తీరిక లేకుండా గడిపే సినిమా తారలు లాక్ డౌన్ కారణంగా, ఇళ్లకే పరిమితమైపోయారు. మూడు నెలల తర్వాత ఇప్పుడు వెసులుబాట్లు రావడంతో కొందరు నిర్మాతలు తమ షూటింగులను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, కొందరు తారలు మాత్రం కరోనాకు భయపడుతూ, ఇప్పట్లో షూటింగులకు హాజరయ్యేది లేదని తెగేసి చెప్పేస్తున్నారు. మరికొందరు మాత్రం వృత్తి ధర్మానికి కట్టుబడి షూటింగులకు రెడీ అంటున్నారు. ఈ నేపథ్యంలో అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్ కూడా షూటింగు చేయడానికి సిద్ధమవుతోంది. అర్జున్ కపూర్ హీరోగా భూషణ్ కుమార్ నిర్మిస్తున్న హిందీ చిత్రంలో రకుల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగును ఈ నెలలోనే ముంబైలో ప్రారంభించనున్నారు. ఇందులో పాల్గొనడానికి ఓకే చెప్పిన రకుల్ త్వరలోనే ఢిల్లీ నుంచి ముంబై రానుంది.  

Leave a Response