అర్థం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలను తీసుకోకూడదు..

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టీఎస్సార్టీసీ సమ్మెపై స్పందించారు. ఉద్యోగుల ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలను తీసుకోకూడదని, టీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన సమ్మె సందర్భంగా 48,660 మంది ఉద్యోగులలో 1200 మందిని తప్ప మిగిలిన వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. నాడు సకలజనుల సమ్మెలో భాగంగా తెలంగాణ పరిధిలోని ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారని అన్నారు. అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగసంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారమైన అనేక సమస్యలను మనం చూశామని, ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా వుందని ,ఉద్యోగులపై ఉదారత చూపి, టీఎస్సార్టీసీ సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ని కోరారు.

Leave a Response