అందరిని ఆక్కటుకుంటున్న మామాంగం…టీజర్

మలయాళంలో సీనియర్ స్టార్ హీరోగా వెలుగొందుతున్న మమ్ముట్టిని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయవంతమైన ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. తాజాగా ఆయన విభిన్నమైన కథాంశంతో కూడిన సినిమాలో ఆయన నటించడం విశేషం. ‘మామాంగం’ అనే టైటిల్ తో మలయాళంలో రూపొందిన ఈ సినిమా, అదే టైటిల్ తో తెలుగు అభిమానుల ముందుకు తెస్తున్నారు. ఈ నెల 21వ తేదీన విడుదల చేస్తున్నారు దర్శకుడు. ఉన్నిముకుందన్ .. ప్రాచీ తెహ్లాన్ .. అను సితార ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా తెలుగు వెర్షన్ కి సంబంధించిన ట్రైలర్ ను వదిలారు. ఆసక్తికరమైన సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ అంచనాలు పెంచుతోంది. చారిత్రక నేపథ్యంలో .. 50 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, మమ్ముట్టి కెరియర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

Leave a Response