అందరూ అనుమానితులే…స్వీటీ

టాలీవుడ్ అందాల సుందరి మన అనుష్క. తన నటనతో టాలీవుడ్ లో అందరిని కట్టిపడేసింది. ఇంక అసలు విషయానికి వస్తే.. ఓ జంట… సరదాగా విహారయాత్రకు వెళ్లింది! అక్కడ ఓ ఘటన జరడగంతో విహారయాత్ర కాస్త పీడకలలా మారింది. ఆ ఘటనకు సాక్షి (అనుష్క)యే సాక్షి. అక్కడేం జరిగిందో వివరించడానికి ఆమెకు మాటలు రావు. సైగలతో చెబుతోంది. ఆమె మూగభాష అర్థం చేసుకునేది ఎవరు? ఘటనకు కారణం ఎవరనే విషయంలో మౌనం ఎలా వీడింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌ అంటున్నారు టాలీవుడ్ దర్శకుడు హేమంత్‌ మధుకర్‌. ఈ ఈ సినిమాలో స్వీటీ ప్రధాన తారగా ఆయన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌, కోన వెంకట్‌ నిర్మిస్తున్నసినిమా ‘నిశ్శబ్దం’. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో క్రాస్‌ ఓవర్‌ చిత్రంగా రూపొందుతుంది. ఇందులో మాధవన్‌, అంజలి, మైఖేల్‌ మ్యాడసన్‌, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్‌ అవసరాల, హంటర్‌ ఓ హరో ఇతర ప్రధాన తారాగణం. గురువారం అనుష్క పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం ‘విహార యాత్ర పీడ కల అయింది… ప్రతి ఒక్కరూ అనుమానితులే’ అని పేర్కొంటూ సినిమా టీజర్‌ విడుదల చేశారు. తెలుగు టీజర్‌ పూరి జగన్నాథ్‌, తమిళ, మలయాళ టీజర్స్‌ను గౌతమ్‌ మీనన్‌, హిందీ టీజర్‌ను నీరజ్‌ పాండే విడుదల చేశారు. ‘‘ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్స్‌, ప్రీ టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. టీజర్‌ ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది.

Image result for anushka shetty

Leave a Response