ఈసారైనా హిట్ కొడతాడో లేదో చూడాలి…

మాస్ మహారాజ్ రవితేజ కొద్ది రోజులుగా పరాజయాలతో సతమతమతం అవుతున్న విషయం మన అందరికి తెలిసిందే.ప్రస్తుతానికి మన హీరో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. రవితేజ డిస్కోరాజా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే నెల 24వ తేదీన అభిమానుల ముందుకు వస్తుంది. ఈ సినిమా విడుదల కాకముందే తన తర్వాతి సినిమాను రవితేజ పట్టాలక్కించబోతున్నాడు. ఇంతకు ముందు తనతో డాన్ శీను, బలుపు సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ ఫోలీసాఫీసర్ పాత్రలో అభిమానవుల ముందుకు వస్తున్నాడు. తమిళ స్టార్ విజయ్ నటించిన బ్లాక్‌బస్టర్ తెరికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై దర్శకుడు గోపీచంద్ తాజాగా స్పందించాడు. ఇది ఏ సినిమాకూ రీమేక్ కాదు. వాస్తవ ఘటనల ఆధారంగా తయారు చేసుకున్న కథ అని తను క్లారిటీ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత హీరోయిన్ శృతీహాసన్ ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలైన తనకు హిట్స్ ని ఇస్తాయేమో చూడాలి మరి.

Image result for raviteja

Leave a Response