ధోని రిటైర్మెంట్‌పై భార్య సాక్షి సింగ్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై వార్తలు రావడం కొత్తేం కాదు. అయితే వాటిని ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ఖండిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే బుధవారం సాయంత్రం ఉన్నట్లుండి ట్విట్టర్‌లో ధోని రిటైర్మెంట్‌పై పెద్ద ఎత్తున ట్వీట్ వచ్చాయి. DhoniRetires హ్యాష్‌ట్యాగ్‌తో చాలా ట్వీట్లు వచ్చాయి. దీంతో ఆ హ్యాష్‌ట్యాగ్ కాస్త ట్రెండ్ అవ్వగా ధోని భార్య సాక్షి సింగ్ రంగంలోకి దిగారు. ”అవన్నీ కేవలం గాలి వార్తలే. దీన్ని బట్టి లాక్‌డౌన్ మనుషులను పిచ్చోళ్లను చేసిందని అర్థమవుతోంది” అని సాక్షి ట్వీట్ చేశారు. ఆ తరువాత కాసేపటికే ఆమె ఆ ట్వీట్‌ని డిలీట్ చేశారు.

Leave a Response