నిర్మాతగా వస్తున్న ఎన్టీఆర్…

టాలీవుడ్ స్టార్ డమ్ అందుకున్న టాప్ సినీ నటులు హీరోలుగా కొనసాగుతూనే, నిర్మాతలుగా కూడా మారిపోతున్నారన విషయం మన అందరికి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ యాంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నిర్మాతగా మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ సహా మరికొంత మంది హీరోలు చిత్ర నిర్మాణరంగంలోకి దిగి సక్సెస్ లు అందుకుంటున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వారి బాటలో సాగనున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన నిర్మాణ సంస్థకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశముంది. ప్రస్తుతం ఎన్టీఆర్, ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. దీని తర్వాత కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు.

Image result for ntr

Leave a Response