రొమాంటిక్ గా రమ్యకృష్ణ…

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటిస్తున్న సినిమా రొమాంటిక్. ఈ సినిమాని పూరి శిష్యుడు అనిల్ పాడూరి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని ఛార్మి, పూరి కలిసి నిర్మిస్తున్నారు. ఆకాష్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా తెలుగు అభిమానులకు పరిచయం అవుతుంది. ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ యువతకి సెగలు పుట్టించిన సంగతి మన అందరి తెలిసిందే. అయితే ఈ సినిమాలో శివగామిని అందే నండీ రమ్యకృష్ణ కూడా ఓకీలక పాత్రతో అభిమానుల ముందుకు రావడం టాలీవుడ్ లో విశేషంగా మారింది. మొదట మందిరా బేడీని పెట్టి కొన్ని సన్నీ వేషాలను తీశారు. ఆ సన్నీ వేషాలు పూరీని ఆకట్టుకోలేకపోయాయట. మందిరా బేడీ స్థానం లో రమ్యకృష్ణ అయితే బాగుంటుందని తెలుగు ప్రేక్షకులకు కూడా తొందరగా రీచ్ అవుతుందని బావించాడట దర్శకుడు. అందుకే మందిరా బేడీని పక్కకు తప్పించి రమ్యకృష్ణ ను తెరమీదకెక్కించాడట. రమ్యకృష్ణ తో మొదట నుంచి సన్నివేశాలను చిత్రీకరించటం వల్లే సినిమా కూడా లేట్ అవుతూ వస్తుందని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Image result for ramya krishnan

Leave a Response