లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్‌

ఓ రైతుకు సంబంధించి భూ లావాదేవీని ఆన్‌లైన్‌లో పరిష్కరించేందుకు లంచం తీసుకుంటూ కర్నూలు జిల్లా గూడురు తహసీల్దార్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు…మండలానికి చెందిన ఓ రైతు భూమికి సంబంధించిన లావాదేవీ ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న రైతు పలుమార్లు అధికారులను కలిశాడు. ఈ లావాదేవీ పూర్తి చేసేందుకు గూడురు తహసీల్దార్‌ హసినాబీ 8 లక్షల రూపాయలు డిమాండ్‌ చేశారన్నది రైతు ఆరోపణ. దీనికి రైతు అంగీకరించడంతో ముందుగా నాలుగు లక్షలు ఇవ్వాలని కండిషన్‌ విధించారు. ఈ మేరకు రైతు నుంచి తహసీల్దార్‌ నాలుగు లక్ష రూపాయలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Leave a Response