విజయ్ నిర్మల గారికి కన్నీటి వీడుకోలు…

విజయనిర్మల పుట్టిల్లు నరసరావుపేట. విజయనిర్మల తల్లి శకుంతల, అన్నలు వసంతరావు, సంజీవరావు పాతూరులో వీరి కుటుంబాలన్నీ ఉండేవి. విజయనిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. తదనంతర కాలంలో విజయనిర్మల తల్లిదండ్రులతో కలిసి చెన్నై వెళ్లిపోయారు. ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము.ఇక తాను నిన్న మరణించారు. ఇక తన అంత అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ పరిధిలోని చిలుకూరు గ్రామంలో ఉన్న విజయకృష్ణ వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం కుటుంబసభ్యులు, అభిమానుల మధ్య నిర్వహించారు. విజయనిర్మలను కడసారిగా చూసేందుకు భారీగా ఆమె ఆభిమానులు, సినీరంగ, రాజకీయ ప్రముఖులు, ఆర్టిస్టులు తరలివచ్చారు. విజయనిర్మల అంతిమయాత్ర ప్రత్యేక పూలతో తయారు చేసిన వాహనంలో హైదరాబాద్‌ నుంచి చిలుకూర్‌లోని వ్యవసాయ క్షేత్రం వరకు సాగింది. మధ్యాహ్నం 2:30 గంటలకు విజయనిర్మల తనయుడు, నటుడు నరేశ్‌ అంత్యక్రియలు నిర్వహించాడు. విజయనిర్మల భర్త హీరో కృష్ణ అంత్యక్రియల సమయంలో తీవ్రంగా రోదించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య విజయనిర్మల పార్థీవ దేహానికి నివాళులర్పించారు. అలాగే మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఆమె కుమారుడు ఎంపీ గల్లా జయదేవ్‌, నిర్మాత సి.కళ్యాణ్‌, అలీ, శివకృష్ణ తదితర సినీ, టీవీ ఆర్టిస్టులు పెద్దసంఖ్యలో వచ్చారు.

Leave a Response