జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో సిద్ధూ..!

Siddhu at national level kabaddi competitions ..!

బాల్యం నుంచి క్రీడలపై ఆసక్తి గల సిద్ధూ నిత్యం ఏవో ఆటల పోటీల్లో పాల్గొంటూనే ఉండేవాడు. అయితే, మారుమూల గిరిజన తండా కావడంతో గురుకుల పాఠశాలకు వచ్చేవరకు సిద్ధూ ప్రతిభ వెలుగులోకి రాలేదు.నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని పొట్టివాని తండా రమావత్‌ సిద్ధూ (12) స్వస్థలం. అతడి తల్లిదండ్రులు రమావత్‌ బాలూనాయక్‌-బుజ్జి. గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష రాసి దేవరకొండ దగ్గర్లోని కొల్లిముంతలపాడులో సీటు సంపాదిం చాడు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న సిద్ధూ నవంబరు 25 నుంచి 30 వరకు నేపాల్‌లోని ఫొఖారా నగరంలో జరిగే ఇండో-నేపాల్‌ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యాడు. నేపాల్‌కు వెళ్లాలంటే ప్రయాణ ఖర్చుల నిమిత్తం దాదాపు రూ.50 వేల ఖర్చు అవుతుందని నిర్వాహకులు తెలిపారు. దీంతో నిరుపేద కుటుంబానికి చెందిన సిద్ధూ ప్రభుత్వ, దాతల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే పలు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన సిద్ధూ గురుకులాల సొసైటీ నిర్వహించే కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఉత్తమ క్రీడాకారుడిగా అనేక అవార్డులు అందుకు న్నాడు.

Leave a Response