కరోనా బారిన పడిన నవ్య స్వామి

తెలుగు టీవీ సీరియల్ నటి నవ్యకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో బుల్లితెర రంగం షాక్ కు గురైంది. లాక్ డౌన్ తర్వాత షూటింగులకు అనుమతించాలంటూ టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ షరతులతో కూడిన సినిమా, సీరియల్స్ షూటింగ్ లకు టీఎస్ ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగులు ప్రారంభం కాకపోయినా.. సీరియల్స్ షూటింగులు మాత్రం ప్రారంభమయ్యాయి. అయితే, ఈ షూటింగులపై కరోనా ప్రభావం చూపింది. ఇప్పటికే ఇద్దరు నటులకు కరోనా సోకింది. తాజాగా ఒక నటి కూడా కరోనా బారిన పడ్డారు. సీరియల్ నటి నవ్య స్వామికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తెలంగాణ ప్రభుత్వం షూటింగులకు అనుమతించిన తర్వాత ఆమె షూటింగుల్లో పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆమె ‘నా పేరు మీనాక్షి’ అనే సీరియల్ షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. నవ్యకు కరోనా అని నిర్ధారణ కావడంతో యూనిట్ సభ్యులంతా ఆందోళనకు గురవుతున్నారు.

Leave a Response